Home  »  TV News  »  Karthika Deepam2 : దాస్ ఆన్ ఫైర్.. జ్యోత్స్న నిజం తెలుసుకుంటుందా!

Updated : Feb 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -595 లో....అత్తయ్య కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంది బావ. నువ్వే ఎలాగైనా అత్తయ్యకి నిజం చెప్పాలని కార్తీక్ తో దీప చెప్తుంది. నా వల్ల కాదని దీప కాళ్లపై కార్తీక్ పడుకొని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కాశీ దగ్గరికి దాస్ వస్తాడు. ఎలా ఉన్నావ్ నాన్న అని కాశీ అడుగగా చేతకాని తండ్రి ఎలా ఉంటాడని దాస్ అంటాడు. నేను అన్న మాటలు ఏం పట్టించుకోకండి నాన్న అని కాశీ అంటాడు. జ్యోత్స్న గురించి టాపిక్ వస్తుంది. జ్యోత్స్న అక్కని వదిలేసాను. ఇప్పుడు తనే పెద్దమ్మ ప్రాణాలు కాపాడుతుంది. లేదంటే అసలు వదిలి పెట్టేవాడిని కాదని కాశీ అంటాడు.

ప్రాణాలు కాపాడడం ఏంటని దాస్ అడుగుతాడు. సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని కాశీ అనగానే అలా ఎలా మ్యాచ్ అవుతాయని దాస్ షాక్ అవుతాడు. దీప అక్కకి ఒకసారి కళ్ళు తిరిగితే వచ్చింది కదా డాక్టర్ హారిక గారు ఆవిడే చెప్పారని కాశీ చెప్పగానే కోపంగా దాస్ అక్కడ నుండి బయల్దేతాడు. మరొకవైపు డాక్టర్ హారిక దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. మీతో మాట్లాడాలని జ్యోత్స్న అనగానే ఇప్పుడు ఈవిడ ఏం మాట్లాడుతుందో నాకు తెలుసని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న మాటలు కార్తీక్ కి వినపడగానే ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే కార్తీక్ హాస్పిటల్ కి బయల్దేరతాడు. ఫస్ట్ ఎందుకు మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఎందుకు మ్యాచ్ అయ్యాయని జ్యోత్స్న అనగానే మీకు మ్యాచ్ అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లమ్.. మీరు సుమిత్ర గారి కూతురు కాబట్టి మ్యాచ్ అయిందని డాక్టర్ చెప్పగానే జ్యోత్స్న ఇంకా డౌట్ గా మాట్లాడుతుంది. మీ డాడీకి కాల్ చెయ్యాలా అని డాక్టర్ అనగానే వద్దు డాక్టర్ అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. జ్యోత్స్న, డాక్టర్ మాట్లాడుకోవడం దాస్ చూస్తాడు. అంటే డాక్టర్ కూడా అమ్ముడుపోయిందని డాక్టర్ గురించి దాస్ తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు జ్యోత్స్న అయిపోయిందని నర్సు చేతిలో ఉన్న కత్తెరని తీసుకొని దాస్ వెళ్తుంటే కార్తీక్ వచ్చి ఆపుతాడు.

మరొకవైపు అనసూయని కాంచన పిలుస్తుంది. దీప వస్తుంది. దీపతో కాంచన కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే స్వీట్ తీసుకొని శ్రీధర్ వస్తాడు. దీప కోసం కావేరీ చేసింది మీ అత్తయ్యకి కూడా ఇవ్వమని శ్రీధర్ అనగానే వాళ్ళు మాట్లాడుకోవడం లేదని శౌర్య అంటుంది. ఏమైందని దీపని శ్రీధర్ అడుగుతాడు. నాన్నతో కలిసి ఉండమని మాటివ్వమని మీ అబ్బాయి అన్నాడని దీప చెప్తుంది. అసలు కార్తీక్ ఎందుకు అలా అడిగాడని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు దాస్ ని కార్తీక్ పక్కకి  తీసుకొని వెళ్తాడు. అప్పుడే డాక్టర్ వస్తుంది. జరిగింది మొత్తం చెప్తుంది. దాస్ కి ఏం జరిగిందో క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.